calender_icon.png 29 November, 2024 | 6:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోగులకు మెరుగైన సేవలందించాలి

29-11-2024 03:37:20 PM

ఆసుపత్రిలో రోగులకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలి

పెద్దపల్లి ఆసుపత్రిని సందర్శినలో జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష

పెద్దపల్లి,(విజయక్రాంతి): వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రి లోకి వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి లోని ఆయుష్మాన్ భారత్ ఓపి రిజిస్ట్రేషన్, కంటి శస్త్ర చికిత్సల థియేటర్, ల్యాబ్, జనరల్ వార్డు, ఆపరేషన్ థియేటర్, డెంటిస్ట్ విభాగం, ఫిజియో థెరపీ విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ ఆస్పత్రి ఎంట్రన్స్ వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని  తెలిపారు.  ఫిజియోథెరపీ క్రింద ప్రతి రోజు 15 రోగులకు చికిత్స అందిస్తున్నామని, ఈ సంఖ్య రెట్టింపు చేసే దిశగా పనిచేయాలని సూచించారు. ఆర్థోపెడిక్, ఆపరేషన్లు జరిగిన రోగులకు అవసరమైన ఫిజియోథెరపీ మన వద్ద జరిగే విధంగా చూడాలని, ఫిజియోథెరపీ ఆర్థోపెడిక్ విభాగాలు సమన్వయంతో పని చేయాలన్నారు. ఈ  తనిఖీల్లో జిల్లా కలెక్టర్ వెంట  ఆర్.ఎం.ఓ రవీందర్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గోన్నారు.