calender_icon.png 9 October, 2024 | 5:50 PM

మెరుగైన సేవలు అందించేందుకు ఐసిడిఎస్ సూపర్ వైజర్లకు స్కూటర్ల అందజేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

09-10-2024 03:06:49 PM

పెద్దపల్లి, (విజయక్రాంతి): జిల్లాలోని మహిళలకు మెరుగైన సేవలు అందించేందుకు ఐసిడిఎస్ సూపర్ వైజర్లకు స్కూటర్ల అందజేయడం జరిగిందన్నారు. బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ ఆవరణలో జిల్లా కలెక్టర్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ తో కలిసి ఐసిడిఎస్ సూపర్వైజర్లకు, సఖి కేంద్రాలకు స్కూటర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని బాధిత మహిళలకు మెరుగైన సేవలు మరింత వేగవంతంగా అందెందుకు మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమశాఖ పరిధిలో పని చేస్తున్న 31 మంది ఐసిడిఎస్ సూపర్వైజర్లకు ఒకటి చోప్పున, జిల్లాలో ఉన్న సఖీ కేంద్రానికి 3, మొత్తం 34 స్కూటర్లను 20 వేల రూపాయల డౌన్ పేమెంట్ కలెక్టరేట్ నిధుల నుంచి చెల్లించి పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో  జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, ఏ.ఓ.శ్రీనివాస్ సి.డి.పి.ఓ. లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.