calender_icon.png 15 November, 2024 | 2:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు అనువైన భవనాన్ని అన్వేషించండి

14-11-2024 07:30:34 PM

ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): నర్సింగ్ విద్యార్థులకు అనుకూలమైన, సకల వసతులు కలిగిన నర్సింగ్ విద్యార్థుల వసతి సదుపాయాల ఏర్పాటుకు అనుకూలమైన భవనం అన్వేషించాలని కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ శేషాంజనస్వామిని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశించారు. గురువారం నర్సింగ్ విద్యార్థుల వసతి సదుపాయాల ఏర్పాటుకు అనుకూలమైన భవనం పరిశీలించుటకు శ్రీ రామచంద్ర బాలికల పాఠశాల బిల్డింగును ఆయన సందర్శించారు.

ప్రస్తుతం ఉన్న నర్సింగ్ కళాశాల భవనంలో విద్యార్థుల కు వసతి కల్పించుటకు సరిపోకపోవడంతో, విద్యార్థులకు సరిపడా వసతి కల్పించుటకు అనుకూలమైన భవనం ను అన్వేషించాలని కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ కు సూచించడం జరిగింది. ఈ సందర్భంగా భాగంగా నర్సింగ్ విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొని వారందరూ తల్లిదండ్రుల ఆశయాల మేరకు కష్టపడి చదివి ఉన్నత స్థాయిలో స్థిరపడాలని తెలియజేశారు. ఏమైనా వారికి సంబంధించిన పుస్తకాలు కావాలంటే నేను ఏర్పాటు చేస్తానని నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ కు సూచించడం జరిగినది. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీ) విద్యా చందన, జిల్లా విద్యాశాఖ ప్లానింగ్ కోఆర్డినేటర్ సతీష్ కుమార్, కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ మరియు నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.