calender_icon.png 25 February, 2025 | 2:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిటిపిఎస్ ను సందర్శించిన కలెక్టర్ జితేష్ వి పాటిల్..

24-02-2025 10:33:29 PM

మణుగూరు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ను సోమవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. ప్లాంట్ లోనే యూనిట్లను పరిశీలించారు. అనంతరం బీటీపీఎస్సీ బిచ్చన్నతో పాటు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రానున్న వేసవి నేపథ్యంలో ఏర్పడే విద్యుత్ డిమాండ్కు తగినట్లుగా ఉత్పత్తిని సాధించాలని సూచించారు. యూనిట్-1 లో నెలకొన్న జనరేటర్ సమస్యపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్లాంట్ లోనే నాలుగు యూనిట్లు నిరంతర విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియ కొనసాగాలని బ్రేక్ డౌన్ కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది. సమావేశంలో ఎస్సీ రాంప్రసాద్ తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు.