calender_icon.png 15 November, 2024 | 11:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు వెదురు మొక్కలు అందించడానికి ప్రణాళికలు సిద్ధం

15-11-2024 09:10:54 PM

మణుగూరు,(విజయక్రాంతి): ఆదివాసి గిరిజన గ్రామాలలోని రైతుల పంట పొలాలలో అడవి జంతువుల భారీ నుండి రక్షణ కొరకు కంచె ఏర్పాటు చేసుకోవడానికి పొలాల చుట్టూ వెదురు మొక్కలు నాటుకోవడానికి రైతులకు వెదురు మొక్కలు అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నందున వెదురు మొక్కలు అవసరం ఉన్నదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని సందెళ్ల రామాపురం గ్రామంలో ఉన్న నర్సరీని ఆయన సందర్శించారు. నర్సరీలో ఏ విధమైన మొక్కలు పెంచుతున్నారని నర్సరీ ఇంచార్జ్ బిబి నాయక్ ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... గిరిజన రైతులు మునగ చెట్లు మరియు ఇతర ఫలాలకు సంబంధించిన చెట్లు వేసుకుని ఆర్థికంగా బలోపేతం కావడానికి వ్యవసాయ అధికారులతో ప్రత్యేక సమావేశాల ద్వారా వారికి అవగాహన కల్పిస్తున్నామని అన్నారు.

ముఖ్యంగా మునగ పంటలు సాగు చేసుకోవడానికి అవి పెరిగే వరకు వాటికి రక్షణగా వెదురు మొక్కలను పొలం చుట్టూ కంచెలుగా ఏర్పాటు కొరకు రైతులకు అందించడానికి తప్పనిసరిగా వెదురు మొక్కలు అవసరం ఉన్నదని అన్నారు. పది ఎకరాల వెదురు టేకుతో పాటు 16 రకాల అడవి మొక్కలు పెంచుతున్నందున వాటి రక్షణ జాగ్రత్తగా చూసుకోవాలని ఎక్కువ శాతం వెదురు మొక్కలు పెంచే ప్రయత్నం చేయాలని ఆయన అన్నారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా నీరు పోయించాలని కలుపు మొక్కలు పెరగకుండా చూడాలని బీట్ ఆఫీసర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ విద్యా చందన, నర్సరీ ఇంచార్జ్ బీబీ నాయక్, బీట్ ఆఫీసర్ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.