calender_icon.png 22 September, 2024 | 9:41 PM

విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి

22-09-2024 07:32:35 PM

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): విద్యార్థులు చిన్నతనం నుంచే చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి పెంచుకొని రాణించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఆదివారం పాల్వంచ పట్టణ పరిధిలోని శ్రీనివాస్ కాలనీలో గల మినీ క్రీడా ప్రాంగణంలో నిర్వహిస్తున్న హాకీ క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ మాట్లాడుతూ... విద్యార్థులు క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొని జిల్లా రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరచాలని ఆ దిశగా వారిని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

నేటి తరం విద్యార్థులు సెల్ ఫోన్లు యూట్యూబ్లో నిమగ్నమై వారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చదువుతూనే క్రీడల్లో పాల్గొంటే వారినిలో మానసిక వికాసంతో పాటు శారీరక దారుఢ్యం వికసిస్తుందన్నారు. క్రీడల ద్వారా భవిష్యత్తు యువతరం ఆరోగ్యవంతంగా ఉత్సాహంగా తమ లక్ష్యంలో రాణించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎస్ఓ పరంధామ రెడ్డి, డీసీఎంహెచ్ చైర్మన్ కొత్తవాళ్ల శ్రీనివాస్ రావు, డాక్టర్ యుగేందర్, అన్నం వెంకటేశ్వర్లు, విజయబాబు తదితరులు పాల్గొన్నారు.