calender_icon.png 19 January, 2025 | 10:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామ సభలకు విస్తృత ఏర్పాట్లు చేయాలి

19-01-2025 07:42:07 PM

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల ఫీల్డ్ వెరిఫికేషన్, గ్రామ సభలపై ఆదివారం  అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యచందన, సీఈఓ నాగలక్ష్మి, ఆర్డీఓలు, తహసీల్దార్ లు,  వ్యవసాయ శాఖ అధికారి, సివిల్ సప్లై, ఎంపిడిఒ, వ్యవసాయ అధికారులు, ఎంపీవోలు, మున్సిపల్ కమిషనర్ లతో టెలికాన్ఫిరెన్స్ నిర్వహించి సంబంధిత అధికారుల సందేహాలను జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ నివృత్తి చేశారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ సర్వే పురోగతి పై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ జితేష్ వి.పాటిల్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు ఈ నెల 21 నుండి 24 వరకు నిర్వహించే గ్రామసభలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని, గతంలో నిర్వహించిన ప్రజపాలన గ్రామసభల మాదిరిగానే 21 నుండి చేపట్టే గ్రామ సభలను నిర్వహించాలి.

ప్రతీ రోజు ఒక గ్రామ పంచాయతీలో మాత్రమే గ్రామ సభలు నిర్వహించాలన్నారు.  గ్రామ సభలకు హాజరయ్యే ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాలలో ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని  స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డ్ లు జారీ  చేయడం జరుగుతుందని రేషన్ కార్డుల జారీ ఇందిరమ్మ ఇండ్ల పథకం నిరంతరం ప్రక్రియ అని చివరి లబ్ధిదారుల వరకు అందించడం జరుగుతుందని ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ నెల 21 నుంచి 24 వ తేదీ వరకు నిర్వహించే గ్రామ సభలలో వచ్చిన దరఖాస్తులను స్వీకరించడంతో పాటు ప్రజాపాలన లో వచ్చిన దరఖాస్తులను కూడా పరిశీలించడం  జరుగుతుందని ప్రస్తుతం ప్రచారంలో ఉన్న రేషన్ కార్డ్ ల లబ్ధిదారుల జాబిత కులగణన (సామాజిక) సర్వే ఆదారంగా తయారు చేసిందని  ఇది తుది జాబితా కాదని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26 వ తేదీ నుంచి ప్రతిష్టాత్మకంగా నాలుగు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టబోతుందని , రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కోసం ఈ నెల 21 నుండి 24 వరకు నిర్వహించే గ్రామ సభలలో దరఖాస్తులను  ప్రజాపాలన సేవా కేంద్రాల ద్వారా కూడా కొత్త రేషన్ కార్డులకు లేదా కొత్త సభ్యుల చేర్పుల కై దరఖాస్తులు కూడా స్వీకరించడం  జరుగుతుందని ఇప్పటికే , గతంలో జరిగిన ప్రజాపాలన సదస్సులలో స్వీకరించిన దరఖాస్తుల జాబితాలో అర్హులైన వారిని గుర్తించే ప్రక్రియ పురోగతిలో ఉందని తెలిపారు.  ఇంకా మిగిలిన ఫీల్డ్ వెరిఫికేషన్ రెపటి లోగా పూర్తి చేయాలి,గ్రామ సభలో  కలెక్ట్ చేసేటప్పుడు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలి నంబర్, పేర్లు,  ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ అడ్రస్ తీసుకోవాలి. ఎవరిదైనా పేర్లు మిస్ అయితే ప్రజాపాలన మీ సేవ కేంద్రాల లో దరఖాస్తులు చేసుకోవచ్చు.

రేషన్ కార్డులకు సంబంధించి ప్రతిదీ రిజిష్టర్ లో నమోదు చేయాలి.ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇంటి స్థలం ఉన్న వారి జాబిత ఇంటి స్థలం లేని వారి రెండు జాబితాలను గ్రామ సభలలో ప్రదర్శించాలని, అలాగే కొత్తగా గ్రామ సభలలో వచ్చే దరఖాస్తులను కూడా పరిశీలించాలని సూచించారు. జిల్లాలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ రేషన్ కార్డులను ఇవ్వడం జరుగుతుందని రేషన్ కార్డుల మంజూరికి  దరఖాస్తులను  స్వీకరించే ప్రక్రియ నిరంతరం కొన సాగుతుందని స్పష్టం చేశారు. వ్యవసాయ యోగ్యమైన ప్రతీ భూమికి రైతు భరోసా కల్పించడం జరుగుతుందని అన్నారు. వ్యవసాయ అధికారులు, రెవిన్యూ అధికారులు సంయుక్తంగా రైతు భరోసా లబ్దిదారులను గుర్తించాలన్నారు. ఉపాధి హామీ పథకంలో కనీసం ఇరవై రోజుల పాటు కూలి పనికి వెళ్లిన వారికే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వర్తింప చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతీ కుటుంబంలో మహిళల బ్యాంకు ఖాతాల కే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మొత్తాన్ని బదిలీ చేయడం జరుగుతుందని  ఆన్నారు.