calender_icon.png 22 March, 2025 | 7:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత సామరస్యాలకు ప్రతీక ఇఫ్తార్ విందు: కలెక్టర్ జితేష్ వి. పాటిల్

21-03-2025 11:36:41 PM

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు మతసామరస్యానికి ప్రతీక అని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. శుక్రవారం మైనార్టీ సంక్షేమ శాఖ(Minority Welfare Department) ఆధ్వర్యంలో ఐడీఓసీ కార్యాలయంలోని ముస్లిం ఉద్యోగులకు నిర్వహించిన ఇఫ్తార్ విందులో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముస్లిం సోదరులు రంజాన్ మాసం అంతా భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఆచరించే ముస్లిం సోదరులకు ఇచ్చే ఇఫ్తార్ విందు లాంటి కార్యక్రమాలు ప్రజలలో సోదర భావాన్ని పెంపొందిస్తాయన్నారు. రంజాన్ మాస విశిష్టతను కొనియాడారు. అన్ని మతాలు చెప్పేది ఒక్కటేనని, మనషులంతా సోదర భావంతో ఉండాలన్నారు. సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లింల‌కు ఫలహారాలు తినిపించి ఉపవాస దీక్ష విడిపించారు. అనంతరం ఉద్యోగులు కలెక్టర్ కు కురాన్ ను బహుకరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్, సిపిఓ సంజీవరావు, ఏపీ ఆర్వో అజ్గర్ హుస్సేన్ మరియు అన్ని శాఖల ముస్లిం ఉద్యోగస్తులు పాల్గొన్నారు.