27-02-2025 09:32:28 PM
మహిళల వేధింపులపై అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): పని ప్రదేశాల్లో మహిళల పట్ల లైంగిక వేధింపులు నేరమని జిల్లా న్యాయ సేవా అధికారి సమస్త కార్యదర్శి భానుమతి(District Legal Services Officer General Secretary Bhanumathi) అన్నారు. మహిళలకు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్(Collector Jitesh V. Patil) పేర్కొన్నారు. గురువారం ఐడిఓసి కార్యాలయంలో జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ వారి ఆధ్వర్యంలో మహిళలకు చట్టాలపై అవగాహన సదస్సును సర్వీసెస్ సెక్రటరీ గొల్లపూడి భానుమతి అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పని ప్రదేశాలలోమహిళా ఉద్యోగులపై తోటి సాహుద్యోగులు లైంగిక వేధింపులకు గురి చేస్తే మహిళా చట్టాలను ఉపయోగించి ఫిర్యాదు చెయ్యాలని సూచించారు.ఎవరైనా మహిళలు వేధింపులకు గురైతే నేరుగా ఫిర్యాదు చేస్తే విచారణ చేపట్టి వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత పైన మహిళలకు అవగాహన కల్పించారు.
భవిష్యత్ ప్రణాళికలో ఆర్థిక అక్షరాస్యత కీలక పాత్ర పోషిస్తుందన్నారు. బ్యాంకు పరిధిలోని ప్రజలందరూ జీవనజ్యోతి, ప్రధానమంత్రి యోజన ఇతర పథకాలన్నీ వినియోగించుకోవాలని, వాటి గురించి అవగాహన చేసుకోవాలని కలెక్టర్ చెప్పారు. అనంతరం జిల్లా న్యాయ సేవా అధికారి సమస్త కార్యదర్శి భానుమతి మాట్లాడుతూ పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు నేరమని జిల్లా న్యాయసేవాధికారి సంస్థ కార్యదర్శి జి.భానుమతి తెలిపారు. సేవాధికార సంస్థ ఈ సందర్భంగ న్యాయమూర్తి మాట్లాడుతూ లైగింక వేధింపుల నివారణకు విశాఖ మార్గదర్శకాలను భారతసుప్రీం కోర్టు జారీచేసిందని ఆమె గుర్తు చేశారు. స్త్రీల రక్షణ కోసం చట్టం అనే బలమైన సాధనం ఉందని, ఎంతటి బలవంతుడైన చట్టం ముందు సమానమే అన్నారు. మహిళా సాధికారతకు వ్యక్తులు, వ్యవస్థలు సహకారం అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల కలెక్టర్ విద్యా చందన, లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ రెడ్డి, మహిళా శిశు మరియు వయోవృద్ధుల శాఖ అధికారి స్వర్ణలత లెనినా, ఎస్బిఐ బ్యాంక్ రీజనల్ మేనేజర్ రాజబాబు, జిల్లా భారత్ అసోసియేషన్ అధ్యక్షులు లక్కినేని సత్యనారాయణ మరియు తదితరులు పాల్గొన్నారు.