calender_icon.png 4 March, 2025 | 9:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్ఫూర్తి ప్రదాత స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాద రావు : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

02-03-2025 02:11:54 PM

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభకు వన్నె తెచ్చిన మాజీ స్వీకర్, స్వర్గీయ నేత దుద్దిళ్ల శ్రీపాదరావు అని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. ఆయన జయంతి సందర్భంగా ఆదివారం ఐడిఓసి కార్యాలయం సమావేశం మందిరంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ తో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు ఆర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… స్వర్గీయ శ్రీపాద రావు న్యాయవాదిగా ప్రజలకు మంచి సేవలు అందించారని, ఆయన రాజకీయ ప్రస్థానంలో మొదటిగా సర్పంచ్ గా రెండు సార్లు ఎన్నికై తదుపరి మహాదేవపూర్ సమితి అధ్యక్షుడిగా ఎన్నికైయ్యారని చెప్పారు.

1984 ఎన్నికల్లో మొదటి సారి మంథని నుంచి శాసన సభ్యులుగా పోటీ చేసి విజయం సాధించి 3 సార్లు శాసన సభ్యునిగా ఎన్నికైనట్లు తెలిపారు. 1994 లో ఓటమి పాలు అయినప్పటికీ ప్రజల మధ్యనే ఉంటూ ఎన్నో సేవలు అందించడం అలాగే 1999 ఏప్రిల్ 13న మహదేవపూర్ మండలం అన్నారంకు తన అనుచర వర్గంతో వెళ్లి వస్తున్న క్రమంలో మార్గమధ్యంలోని అడవుల్లో ఆయన వాహనాన్ని నక్సల్స్ ఆపివేసి, ఆయనతో మాట్లాడాలని చెప్పి లోపలికి తీసుకెళ్లి కరుకు తుపాకీ తూటాలతో విగత జీవున్ని  చేశారు. ఆయన మరణించిన... ఇప్పటికీ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు అని కలెక్టర్  అన్నారు. అధికారులు మహనీయుని గురించి కింది స్థాయి సిబ్బందికి కూడా తెలపాలని ఆయన కోరారు.