06-04-2025 10:13:55 AM
భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం మహోత్సవం ఆదివారం ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల 30 నిమిషాల వరకు జరుగునుంది. కళ్యాణ మండపంలోని ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ నితీష్ వి పాటిల్(Collector Jitesh V Patil) ఆదివారం ఉదయం మరోసారి తుది సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఇతర విఐపి లు వస్తున్నందున ఎవరు ఎక్కడ ఉండాలి ప్రోటోకాల్ ఏ విధంగా పాటించాలి అని మండపంలో మండపంలో డ్యూటీ వేసిన అధికారులతో తుది సమీక్షించారు. అలాగే మండపం అంతా తిరుగుతూ పోలీస్ సిబ్బందికి రెవెన్యూ దేవాలయ సిబ్బందికి పలు ఆదేశాలు ఇచ్చారు. టికెట్ తీసుకుని వచ్చిన ప్రతి భక్తున్ని మండపంలోకి అనుమతించాలని, టికెట్ లేని వారిని ఆపివేయాలని ఆదేశించారు. భక్తుల పట్ల అమర్యాదగా ప్రవర్తించొద్దని మీరందరూ భద్రాద్రి కి, జిల్లా యంత్రాంగానికి వన్నె తెచ్చేలా ప్రవర్తించాలని కోరారు.