calender_icon.png 20 January, 2025 | 9:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల తహసీల్దార్ ను అభినందించిన కలెక్టర్ జితేష్ వి పాటిల్

20-01-2025 07:04:18 PM

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): ఈనెల 19 ఆదివారం టాటా ముంబై మారుతాన్ 42.195 Km  నిర్వహణలో భద్రాద్రి జిల్లా కలెక్టరేట్లోని ఎన్నికల విభాగంలో పనిచేయుచున్న తహసిల్దార్ ధారా ప్రసాద్ పాల్గొని 5 గంటల 13 నిమిషాల 35 సెకండ్లలో పై మారతాన్ ను దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగినది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గౌరవ కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్(District Collector Jithesh V Patil) అడిషనల్ కలెక్టర్ (రెవిన్యూ) వేణుగోపాల్ దారా ప్రసాద్ ని సోమవారం అభినందించారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఈ విధంగా శారీరకంగా, మానసికంగా, ఫిట్నెస్ గా ఉండడం ఎంప్లాయిస్ అందరికీ ఎంతో ఉపయోగకరమని, అందరూ కూడా దారా ప్రసాద్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఎంతో కొంత ఫిట్నెస్ సాధించాలని తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో ఏవో రమాదేవి, రంగా ప్రసాద్, శ్రీనివాస్ యాదవ్, సాయి కృష్ణ, రామకృష్ణ, నవీన్, నజీర్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.