24-02-2025 12:49:04 AM
నల్లగొండ, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి) : ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో 2025 -26 విద్యా సంవత్సరానికి 5వ తరగతి, ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో 6 నుంచి 9 తరగతుల్లో బ్యాక్లాగ్ ఖాళీల ప్రవేశాలకు ఆదివారం జరిగిన టీజీసెట్ ప్రశాంతంగా ముగిసింది. నల్లగొండలోని చర్లపల్లి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలోని పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి తనిఖీ చేశారు.
పరీక్షకు 12,929 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా..12,503 మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు. 96.71 శాతం హాజరుశాతం నమోదైనట్లు వెల్లడించారు. కలెక్టర్ వెంట గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్కుమార్, పాఠశాల ప్రిన్సిపాల్ తదితరులు ఉన్నారు.