19-03-2025 11:08:58 AM
భద్రాచలం (విజయకాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం(Bhadrachalam ) శ్రీ సీతారామచంద్ర స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్. ఏప్రిల్ 6,7 తేదీలలో జరగనున్న శ్రీరామనవమి ఉత్సవాలు ఏర్పాట్లను పర్యవేక్షించడానికి వచ్చిన కలెక్టర్ ముందుగా స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఈఓ రమాదేవి కలెక్టర్ కి స్వాగతం పలికి వేద పండితుల చేత వేద ఆశీర్వచనం అందించి స్వామివారి ప్రసాదాన్ని అందచేశారు. అనంతరం మిథిలా స్టేడియం లో జరిగే స్వామివారి కళ్యాణ మంటపం వద్ద భక్తుల కోసం ఏ విధమైన ఏర్పాట్లు చేయాలి, వచ్చే భక్తులకు వసతి చలువ పందిళ్ళు,త్రాగునీరు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాట్లను ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండాలని కోరారు. ఆయన వెంట ఆలయ ఈఓ రమాదేవి, అధికారులు రవీంద్రనాథ్ రామకృష్ణ ఇతర శాఖల అధికారులు ఉన్నారు.