15-03-2025 11:01:29 PM
పటాన్ చెరు: పటాన్ చెరు పరిధిలోని ముత్తంగి ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ క్రాంతి వల్లూరు శనివారం పరిశీలించారు. కృత్రిమ మేద ఆధారిత బోధన అభ్యసన ప్రక్రియను ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... అభ్యసన సామర్ద్యాలు కృత్రిమ మేధ ద్వారా మెరుగుపడతాయని అన్నారు. బోధన అభ్యసన ప్రక్రియలు నూతన పద్ధతుల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా ముత్తంగి ప్రాథమిక పాఠశాలలో కృత్తిమ మేద ఆధారిత బోధన ప్రక్రియను ప్రారంభించినట్లు చెప్పారు.
జిల్లాలో 33 పాఠశాలల్లో నేటి నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అనంతరం రామేశ్వరంబండ గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని ఆమె పరిశీలించారు. రామేశ్వరం గ్రామంలో ఇందిరమ్మ ఇల్లును పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టినట్లు ఆమె చెప్పారు. పనులు నాణ్యతగా చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గృహ నిర్మాణ సంస్థ పిడి చలపతిరావు, తహసిల్దార్ రంగారావు, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.