11-04-2025 01:20:26 AM
సూర్యాపేట,ఏప్రిల్10(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ళ పథకం కింద నిర్మించే నమూనా ఇంటిని సూర్యాపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పరిశీలించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటి నిర్మాణం త్వరగా పూర్తి చేసి 5 లక్షల వ్యయం తో ఇందిరమ్మ ఇండ్లను ఎలా నిర్మించాలో ఇంటికి ఉపయోగించిన సామాగ్రి, చేసిన ఖర్చుల వివరాలతో కూడిన పట్టికను ఇంటి ముందు ప్రదర్శించి లబ్ధిదారులకి అవగాహన కల్పించటం జరుగుతుందని తెలిపారు. అనంతరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆకస్మిక తనిఖీ చేశారు.
నిరుద్యోగ యువతకి స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం రాజీవ్ యువ వికాస పథకం ద్వారా ఆర్థిక సహాయం చేస్తుందని ఇట్టి అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని, రూరల్ ప్రాంతాలకు చెందిన వారు స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అలాగే అర్బన్ ప్రాంతంకు చెందిన వారు మున్సిపాలిటి కార్యాలయంలో తప్పనిసరిగా సమర్పించాలని,
దరఖాస్తులని అధికారులు పరిశీలించిన తదుపరి జూన్ 2 వ తేదీన లబ్ధిదారుల జాబితా ప్రకటించటం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమం లో ఎంపిడిఓ బాలకృష్ణ, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.