calender_icon.png 26 December, 2024 | 7:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకుల పాఠశాలను పరిశీలించిన కలెక్టర్

21-12-2024 03:06:09 AM

కోరుట్ల, డిసెంబర్ 20 : జగిత్యాల జిల్లా మెట్పెల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలను శుక్ర వారం జిల్లా కలెక్టర్  బీ.సత్యప్రసాద్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ పాఠశాలలోని ఇరువురు విద్యార్థులు నిన్న  పాము కాటుతో అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన నేపథ్యంలో కలెక్టర్ పాఠశాలను  సందర్శించారు.

ఈ సందర్భంగా పాఠశాలను సందర్శించి  పాఠ శాల ప్రాంగణంలో  జరుగుతున్న  పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పాఠ శాల ఆవరణలో ఎల్లప్పుడు పరిసరాలను పరిశుభ్రం  చేస్తూ, గుంతలు గాని పిచ్చి మొక్కలను గాని పూర్తిస్థాయిలో తొలగించా లని ఆదేశించారు.  పాఠశాల పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని మున్సిపల్ సిబ్బందిని  ఆదేశించారు.

పను ల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసు కుంటామని అధికారులను హెచ్చరించారు. విద్యార్థులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఉపాధ్యాయుల దృష్టికి  తీసుకురావాలని సూచించారు. కలెక్టర్ వెంట, మెట్టుపల్లి ఆర్డిఓ ఎన్. శ్రీనివాస్, డిపిఓ  రఘువరన్, ఎమ్మార్వో, ఎంపీడీవో తదితరులున్నారు.