10 June, 2026 | 4:41 AM

అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్

10-06-2026 01:37 AM

బెల్లంపల్లి, జూన్ 9: మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి, కన్నెపల్లి, నెన్నెల మండ లాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంగళవారం పరిశీలించారు. బెల్లంపల్లి పట్టణంలో రాంనగర్ ప్రాంతంలో చేపట్టిన పట్టణ ప్రాథమిక పాఠశాల నిర్మాణ పనులను, బెల్లంపల్లి మండల కేంద్రంలో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలోని భోజనశాల నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

నియోజకవర్గానికి ఒకటి చొప్పున మంజూరైన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలో భాగంగా బెల్లంపల్లిలో చేపట్టిన పాఠశాల పనులను పరిశీలించారు. కన్నేపల్లి మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి వార్డులు, మందుల నిల్వలు, పరిసరాలను పరిశీలించారు. అలాగే మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి పాఠశాలలో కొనసాగుతున్న భోజనశాల, ప్రహరీ గోడ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం నెన్నెల మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి భోజనశాల, అదనపు గదుల నిర్మాణాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.