calender_icon.png 10 January, 2025 | 1:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి దవాఖానలో కలెక్టర్ తనిఖీ

04-07-2024 02:40:10 AM

కామారెడ్డి, జూలై 3 (విజయక్రాంతి): కామారెడ్డి ప్రభుత్వ దవాఖానను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్యం అందిస్తున్న తీరుపై ఆరా తీశారు. వైద్యులతో మాట్లాడి రోగులకు సరైన వైద్యం అందించాలని ఆదేశించారు. దవాఖానలో పరిశుభ్రతపై సూపరింటెండెంట్‌ను అడిగి తెలుసుకున్నారు. గంటపాటు కలెక్టర్ ఆసుపత్రిలో అన్నివార్డులలో పర్యటించారు. దవాఖానలో నెలకొన్న సమస్యల గురించి తెలుసుకున్నారు. వానకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల వైద్యులు రోగులకు సరైన వైద్యం అందించాలని కోరారు.