calender_icon.png 5 December, 2024 | 7:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

04-12-2024 11:54:21 PM

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం  కొత్తగూడెం వారి అధ్వర్యంలో నిర్వహించబడుతున్న సుజాతనగర్  వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జతేష్ వి పటేల్ బుధవారం ఆకస్మికంగా తనిఖి చేసినారు. ఈ సందర్బంగా ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యంను ఆరబేట్టుకున్న రైతులతో మాట్లాడతూ.. ధాన్యం బాగఆరబేట్టుకుని తెమ శాతం 17 లొపు వచ్చిన తర్వాతనే తూర్పాల పట్టాలని రైతులకి తగు సూచనలు చేశారు. ధాన్యం కోనుగోలు కేంద్రాలలో ధాన్యం అమ్మీ మద్దతు ధరను పొందాలని, తప్పని సరిగా నిబంధనల ప్రకారo ధాన్యం యొక్క తేమ శాతం 17%లో ఉండే లాగ రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు.

అలాగే రైతులు చేపలు పెంచాలనీ, మునగ సాగు పై ప్రత్యేక దృష్టి సారించాలని, మునగ సాగు కొరకు రైతులు ముందుకు రావాలని కొరినారు, వరి ధాన్యం బోనస్ పై ఎటువంటి అపోహలు వద్దని బోనస్ రైతుల ఖాతలో జమచేస్తూమాని తెలియజేసారు,  సొసైటీ సిబ్బంది రైతులకి ఇబ్బందిలేకుండ ధాన్యం కొనుగోలు నిర్వహించాలని, ఎప్పటి లారిలను అప్పుడె ఆన్ లైన్ చేసి రైతుల ఖాతలో వెంటనే డబ్బులు జమ ఆయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారిచేసినారు. ఈ కార్యక్రమాల్లో DSCO రుక్మిణిదేవి, DM Civil Supplies యాస్ త్రీనాధ్ బాబు, మండల వ్యవసాయ అధికరి జి నర్మద, తహసీల్దార్ శిరీష, ఎం పి డి ఒ బి భారతి, డి  టీ ఉమామాహేశ్వర రావు,  సినయర్ అసిస్టెంట్ తోలెం బాబు,  మానిటరింగ్ అధికారి జయశ్రీ  సుజాతనగర్ SI మాలోతు రామాదేవి, వ్యవసాయ విస్తరణ అధీకారులు  శరత్,నరసింహ, ప్రనుష, సొసైటీ  సీ ఈ ఓ సారయ్య, సొసైటీ ఇంచార్జి సైదులు, శివ రైతులు నల్లగోపు పుల్లయ్య, కటికనేని సూధాకర్ రావు, వడుగు శ్రీను, భూక్య రమేష్, లావుడ్య దేవిసింగ్, షేక్ బాడె బాబు, తదితర రైతులు పాల్గొన్నారు.