calender_icon.png 24 November, 2024 | 12:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

23-11-2024 09:19:02 PM

మునగాల (విజయక్రాంతి): మండల పరిధిలోని బరకత్ గూడెంలోని పిఎసియస్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఆకస్మికంగా తనిఖీ చేసారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అక్కడే ఉన్న రైతుల తోటి కొనుగోలు విషయము గురించి అదేవిధంగా మ్యాచర్ పరిశీలించారు. కొనుగోలు చేసి బస్తాలు కుట్టే సందర్భంలో ట్యాగ్ కూడా ఉండాలని సన్నధాన్యానికి ఎస్ అనే సింబల్ బస్తాలపై కూడా ఉండాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్ లకు పంపించాలని ఆదేశించారు. అదేవిధంగా రైతులకు 48 గంటల్లోగా ధాన్యం మద్దతు ధర వస్తుందని వారి ఖాతాలలో జమవుతున్నాయని తెలిపారు. సన్నధాన్యానికి కింటాకు 500 రూపాయలు బోనస్ కూడా వెంటవెంటనే వేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ సూర్యనారాయణ, తహసిల్దార్ ఆంజనేయులు, ఏవో రాజు పిఎసిఎస్ సీఈవో బసవయ్య, ఆర్ ఐ రామారావు, ఏఈఓ రేష్మ రైతులు పాల్గొన్నారు.