జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలకు నిర్ణీత గడువులోగా బియ్యంని సరఫరా చేయాలని, అలసత్వం వహించవద్దని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులోని ఎంఎల్ఎస్ పాయింట్ ను జిల్లా అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్ తో కలిసి గురువారం సందర్శించి బియ్యం నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ఎంఎల్ఎస్ పాయింట్ నుండి కేటాయించిన ప్రకారంగా పాఠశాలలు, గురుకులాలు, అంగన్వాడీలకు నిర్ణీత సమయంలో బియ్యం సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. అనుమతిలేని వాహనాల ద్వారా సరుకులు సరఫరా చేయకూడదని, టెండర్ లో పేర్కొన్న వాహనాలను మాత్రమే వినియోగించాలని, ఇట్టి వాహనాలకు జీపీఎస్ ట్యాగ్ చేయాలని తెలిపారు. పాఠశాలలకు నాణ్యత గల బియ్యం సరఫరా చేయాలని, బియ్యం లోడుతో వెళ్లే వాహనం దారి మధ్యలో ఎక్కడ ఆగకుండా అధికారులు పర్యవేక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎం వెంకట్ నర్సింహ, తహసిల్దార్ రోహిత్ దేశ్ పాండే, ఎంఎల్ఎస్ పాయింట్ ఇంచార్జ్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.