calender_icon.png 11 January, 2025 | 9:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శుభ్రమైన తాగునీరు అందించండి..

06-08-2024 04:42:02 PM

లీకేజీలను వెంటనే మరమ్మతు చేయండి : జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి

మహబూబ్ నగర్: స్వచ్ఛదనం.. పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మంగళవారం మహబూబ్ నగర్ మండలం మన్యం కొండలో గల మిషన్ భగీరథ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి సందర్శించారు. 70 ఎంఎల్డీ  మిషన్ భగీరథ  ట్రీట్ మెంట్ ప్లాంట్ ద్వారా సురక్షిత  త్రాగు నీరు సరఫరా, త్రాగు నీరు టెస్టింగ్ ల్యాబ్ ద్వారా నీరు కలెక్టర్ పరీక్షించారుమిషన్ భగీరథ ట్రీట్ మెంట్ ప్లాంట్ ద్వారా మహబూబ్ నగర్ జిల్లాలో 78 ఆవాసాలకు తాగునీరు అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న సందర్భంగా ఎక్కడైనా పైపులైన్లు లీకేజీ అయితే వెంటనే మరమ్మతులు చేసి మంచినీరు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మొక్కను నాటి నీరు పోశారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఎస్ ఈ జగన్ మోహన్, ఈఈ ఇంట్రా పుల్లా రెడ్డి, ఈఈ గ్రిడ్ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.