కరీంనగర్ (విజయక్రాంతి): కాలాభారతి పనులను మంగళవారం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. ఆడిటోరియంలో లైటింగ్, సౌండ్స్ ఏర్పాటు పనులను, వేదికను, పార్కింగ్ స్థలాన్ని పరిశీలించారు. ప్రేక్షకుల సీట్ల సంఖ్య, ఏర్పాటు చేయబోయే వివిధ సౌకర్యాలను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మరమ్మతులకు సంబంధించి డివిజనల్ ఇంజనీర్ యాదగిరికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, మునిసిపల్ కమిషనర్ చాహత్ బాజ్పేయి, డివిజనల్ ఇంజనీర్ యాదగిరి పాల్గొన్నారు.