17-02-2025 07:50:51 PM
పటాన్ చెరు: బీహెచ్ఈఎల్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. పదవ తరగతి క్లాస్ రూమ్ ని సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. 10 సంవత్సరాల తర్వాత ఎటువంటి ఉద్యోగంలో స్థిరపడాలనుకుంటున్నారో ఆ ఆలోచనకు ఇప్పుడే అంకురార్పణ చేసుకోవాలని సూచించారు. జీవితంలో నిలదొక్కుకునేందుకు పదో తరగతి పరీక్షలు టర్నింగ్ పాయింట్ అని అన్నారు. ప్రణాళిక బద్ధంగా చదివి మంచి ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం విద్యార్థులను పలు సబ్జెక్టుల ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టారు. పాఠశాలలో కిచెన్ రూమ్, మధ్యాహ్న భోజనం నాణ్యత, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్ లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సంగ్రామ్ రెడ్డి, ఎంఈఓ రాథోడ్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.