calender_icon.png 4 March, 2025 | 7:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చలివేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్

04-03-2025 04:11:11 PM

మణుగూరు,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు తాసిల్దార్ కార్యాలయం ఎదుట మంచినీటి చలివేంద్రాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. తాసిల్దార్ కార్యాలయ ఆవరణలో ఉన్న వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు, తాసిల్దార్ కార్యాలయానికి మారుమూల ప్రాంతాలకు, పట్టణానికి చెందిన పలువురు వివిధ పనులపై వస్తుంటారని, వారి దాహార్తిని తీర్చేందుకే ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ రాఘవరెడ్డి, ఆర్ఐ గోపి, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

డీటీపీఎస్ రైల్వే లైన్ నిర్వాసితులతో కలెక్టర్ భేటీ...

మణుగూరు భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ రైల్వే ట్రాక్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న నిర్వాసితులతో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సమావేశం అయ్యారు. సమావేశంలో భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులతో పాటు పార్టీల నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. బాధితులకు న్యాయమైన పరిహారం చెల్లించాలని, బాధితులు నాయకులు ఈ సందర్భంగా కలెక్టర్ ను కోరారు. సమావేశంలో తాసిల్దార్ రాఘవరెడ్డి రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.