calender_icon.png 20 September, 2024 | 2:47 AM

సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి

19-09-2024 06:39:25 PM

యాదాద్రి భువనగిరి,(విజయక్రాంతి): సాధారణ ప్రసవాల పట్ల ప్రోత్సాహించాలని జిల్లా కలెక్టర్ హనుమంత్ కే.జెండగే వైద్యాధికారులకు సూచించారు. గురువారం జిల్లా కలెక్టర్ బొమ్మలరామారం మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి పేషంట్లకు అందుతున్న వైద్య సేవలను, మందుల స్టాక్ వివరాలను, రిజిస్టర్లను పరిశీలించారు. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని, అందుకోసం క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన చోట ఇంటింటి జర సర్వే చేపట్టాలని ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి డాక్టర్ సుమలతకు సూచించారు. అనంతరం మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులో రైతు రుణమాఫీ వివరాలను పరిహాలించారు. వెంట తహసీల్దార్ శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి ఉన్నారు.