జిల్లా అధికారులతో కలెక్టర్ హనుమంత రావు
యాదాద్రి భువనగిరి,(విజయక్రాంతి): ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ ఫలాలు అట్టడుగు ప్రజలకు చేరేలా అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతు రావు అన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆయనకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టరేట్ లోని అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం మినీ మీటింగ్ హాల్ లో నూతన బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... వివిధ శాఖలకు చెందిన అధికారులు అందరు సమన్వయంతో పనిచేసి జిల్లాను అభివృద్ధి పథంలో నిలుపాలన్నారు.
జిల్లా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవలందించాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీ లక్ష్మి నర్సింహాస్వామి వారి ఆశీస్సులతో యాదాద్రి భువనగిరి జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు నడపటానికి నావంతు కృషి చేయడం జరుగుతుందని అన్నారు. వివిధ విభాగాల జిల్లా అధికారులతో డిపార్ట్మెంట్ వారీగా సమీక్షించారు. అందరూ సమన్వయంతో పనిచేసి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారులందరూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి సేవలు అందించాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను అట్టడుగు వర్గాలకు అందేలా కృషి చేస్తామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపడతామని తెలిపారు. ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు మనందరం పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ గంగాధర్, జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జిల్లా ముఖ్య ప్రణాళిక కార్యనిర్వాహక అధికారి శోభా రాణి, ఆర్.డి.ఓ.లు, చౌటుప్పల్ శేఖర్ రెడ్డి, భువనగిరి కృష్ణా రెడ్డి, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ జగన్మోహన్ ప్రసాద్ అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.