calender_icon.png 3 December, 2024 | 10:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ వైద్య అధికారిని సన్మానించిన కలెక్టర్

01-11-2024 04:12:33 PM

యాదాద్రి భువనగిరి,(విజయక్రాంతి): మారుమూల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ ప్రవీణ్ కుమార్ ని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సన్మానించారు. శుక్రవారం అడ్డగూడూరు మండల కేంద్రంలోని PHC ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రికి వచ్చిన రోగులకు సకాలంలో వైద్య సేవలు  అందిస్తున్న తీరును పరిశీలించి సిబ్బందిని అభినందించారు.

సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఆస్పత్రి పరిసరాలు  చాలా చక్కగా ఉన్నందున డాక్టర్ ప్రవీణ్ కుమార్, సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. ల్యాబ్ టెక్నీషియన్ లేక రోగులు ఇబ్బంది పడుతున్నాందున, కలెక్టర్ వెంటనే ల్యాబ్ టెక్నీషియన్ ని డిప్యుటేషన్ ఈరోజు సాయంత్రం నుండి విధులలో చేరాలని ఆదేశాలు జారీ చేశారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ ని కూడా నియమించడం జరిగింది.