యాదాద్రి భువనగిరి,(విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా గ్రామ సభలో కాంగ్రెస్ ఎమ్మెల్యేను పథకాలపై నిలదీసిన ప్రజలు. భువనగిరి మండలం అనంతరం గ్రామంలో బుధవారం జరిగిన గ్రామ సభలో కలెక్టర్ హనుమంతరావుతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిని పథకాలు ఇవ్వరా అని నిలదీసిన గ్రామస్తులు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల పథకాలు రాలేదని, అర్హులకు పథకాలు ఇవ్వరా అని అనిల్ కుమార్ రెడ్డిని ప్రశ్నించారు.