calender_icon.png 22 March, 2025 | 11:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదవ తరగతి పరీక్షా కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

22-03-2025 01:12:01 AM

మేడ్చల్,(విజయక్రాంతి): దుండిగల్ మండలం మల్లంపేట్, షామీర్పేట్ మండలం తూముకుంట జిల్లా పరిష త్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్ష కేంద్రాలను కలెక్టర్ గౌతమ్ శుక్రవారం పరిశీలించారు. పరీక్ష హాల్లో తిరిగి విద్యార్థులు పరీక్ష రాయడానికి పరిశీలించారు. మంచినీరు, లైట్లు, ఫ్యాన్లు తదితర సౌకర్యాలు ఉన్నాయ అని ఎంఈఓ ను అడిగి తెలుసుకున్నారు. పరీక్షలు పూర్తయ్యే వరకు సిబ్బంది అప్రమత్తంగా ఉండి, ప్రశాంతంగా జరిగేలా చూడాలన్నారు. కలెక్టర్ వెంట దుండిగల్ తహసిల్దార్ మతిను, శామీర్పేట తహసిల్దార్ యాదగిరి రెడ్డి, మండల విద్యాధికారులు ఉన్నారు.