calender_icon.png 18 November, 2024 | 9:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తైక్వాండో జాతీయ స్థాయి పోటీలకి ఎంపికైన విద్యార్థులను అభినందించిన కలెక్టర్

18-11-2024 06:32:44 PM

మానకొండూరు (విజయక్రాంతి): ఈ నెల 16,17 వ తేదీలలో సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో జరిగిన ఎస్ జి ఎఫ్ అండర్-19 రాష్ట్ర స్థాయి పోటీలలో శ్రీ చైతన్య డిఫెన్స్, స్పోర్ట్స్ అకాడమీ విద్యార్థినులు పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చి 68వ ఎస్ జి ఎఫ్ జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపిక కావడం జరిగిందని కళాశాల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి సోమవారం తెలిపారు. పతకాలు సాధించిన వారిలో ఎ.అక్షిత అండర్ 59 కేజీల విభాగంలో బంగారు పతకం ఇ.శరన్య 44 కేజీల విభాగంలో బంగారు పతకం సాధించి జాతీయ స్థాయికి ఎంపికయ్యారు.

అలాగే 52 కేజీల విభాగంలో తేజస్విని, 40 కేజీల విభాగంలో మహిత వెండి పతకాలు సాధించిన వారిని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి అభినందనలు తెలిపారు. శ్రీ చైతన్య విద్యాసంస్థల అధినేత ముద్దసాని రమేష్ రెడ్డి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఎంపికైన విద్యార్థినిలు డిసెంబర్ 20 నుండి 24 తేదీలలో మధ్యప్రదేశ్ లో జరిగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల డీన్ జగన్మోహనరెడ్డి, పిడిలెంకల మహిపాల్ రెడ్డి, తైక్వాండో కోచ్ బుర్ర ప్రవీణ్ కుమార్, పిఈటి రామక్రిష్ణ పాల్గొన్నారు.