calender_icon.png 29 April, 2025 | 4:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులను అభినందించిన కలెక్టర్

28-04-2025 10:27:49 PM

మంచిర్యాల (విజయక్రాంతి): జిల్లాలోని ప్రభుత్వ బీసీ బాలుర కళాశాల వసతి గృహం, ప్రభుత్వ బీసీ బాలికల కళాశాల వసతి గృహంలలో ఉండి చదువుకొని ఇంటర్మీడియట్ లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సోమవారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak) అభినందించారు. గురుండ్ల రవీందర్, ఎన్ అభినయలకు కలెక్టర్ చేతుల మీదుగా మెమొంటో ఇచ్చి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ మోతిలాల్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి పురుషోత్తం నాయక్, ఎస్సీ కార్పొరేషన్ డీడీ దుర్గాప్రసాద్, వసతి గృహ సంక్షేమ అధికారులు మోసీన్ అహ్మద్, సుధా లక్ష్మి, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.