కరీంనగర్, ఫిబ్రవరి4 (విజయక్రాంతి): కరీంనగర్ మల్కాపూర్ రోడ్డులోని ప్రభుత్వ బధిరుల ఆశ్రమ పాఠశాల విద్యార్థులను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయి అభినందించారు. రౌండ్ టేబుల్ ఇండియా స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే జాతీ యస్థాయి బధిరుల ఆటల పోటీల్లో కరీంనగర్ ప్రభుత్వ బదిరుల ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు.
వివిధ పోటీల్లో 15 మంది బాలికలు, 22 మంది బాలురు పాల్గొని ద్వితీయ, తతీయ స్థానాల్లో నిలిచి 12 బహుమతులు సాధించినట్లు ప్రధానోపాధ్యాయుడు ఉదయ్ కుమార్, ఉపాధ్యాయులు మోహన్ రావు తెలిపారు.