calender_icon.png 4 March, 2025 | 9:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పల్లెబాటలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

04-03-2025 12:49:56 AM

పరిష్కారానికి ఆదేశాలు నిమగ్నంలో అధికారులు

యాదాద్రి భువనగిరి, మార్చి 3 (విజయక్రాంతి) ః పల్లె బాట కార్యక్రమంలో భాగంగా  కలెక్టర్ ఎం హనుమంతరావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గంగాధర్ తో కలిసి రామన్నపేట మండలం ఇస్కిల్ల  గ్రామాన్ని ఉదయం 5.30 గంటలకు  ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిన్న చిన్న సమస్యలను సాయంత్రంలోగా పరిష్కరించాలని అధికారులను  ఆదేశించారు.  పర్యటనలో భాగంగా మొదటగా మండల స్థాయి అధికారులు  అందరూ వచ్చారా లేదా అని అడిగి తెలుసుకున్నారు.

గ్రామంలో సందర్శన చేస్తున్న క్రమంలో ట్రాన్స్ఫార్మర్లు ఎన్ని ఉన్నాయని ఎలక్ట్రిసిటీ ఏఈ ను అడగగా , వారు 9 ట్రాన్స్ఫార్మర్లు గ్రామంలో ఉన్నాయని తెలియ చేశారు.  ఏఎన్‌ఎం తో పిహెచ్సి ఎక్కడ ఉందని అడిగి వారు ముని పంపులలో పిహెచ్సి ఉందని చెప్పడం జరిగింది. గ్రామంలో ఎంత మంది బాలింతలు ఉన్నారని ఈడీడీలు ఎన్ని ఉన్నాయని, అప్పుడు వారు గ్రామంలో 8 మంది బాలింతలు ఉన్నారని తెలిపారు. 

గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో  ఎంత మంది విద్యార్థులు ఉన్నారని ఎంఈఓ ను అడిగి తెలుసుకొని , వారు 109 మంది విద్యార్థులు ఉన్నారని చెప్పడం జరిగినది.ఓపెన్ స్పేస్ ప్లాట్లలో చెత్త వేసిన వారికి నోటీసులు ఇచ్చి వెంటనే క్లీన్ చేయించాలని పంచాయత్ సెక్రటరీ ను ఆదేశించడమైనది. ఇంటింటికి తిరిగిన క్రమంలో ప్రజలతో మాట్లాడి మీకు రోజుకు ఎన్ని గంటలు నీళ్లు ఇస్తున్నారు , రేషన్ బియ్యం వస్తున్నాయా ,కరెంటు సబ్సిడీ వర్తిస్తుందా, గ్యాస్ సబ్సిడీ వస్తుందా అని అడిగి తెలుసుకున్నారు, వారు రేషన్ బియ్యం వస్తున్నాయి కరెంటు సబ్సిడీ  అందుతుందని తెలిపారు. 

 ఒక వ్యక్తికి గ్యాస్ కనెక్షన్ లేదని ఇప్పించమని కలెక్టర్ ను కొరగా కలెక్టర్ మీరు వెంటనే   మీ సేవలో ధరఖాస్తు అప్లు చేసుకోండి అని చెప్పి సివిల్ సప్లు అధికారితో ఫోన్లో మాట్లాడి వారి యొక్క దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామ పర్యటనలో భాగంగా కలెక్టర్ ప్రజల వద్దకు వెళ్ళి అమ్మ మీ ఇంటికి వచ్చాము మీకు రైతు భరోసా వస్తుందా అని అడగానే వస్తున్నది  అని చెప్పడం జరిగింది. రేషన్ బియ్యం 18 కిలోలు వస్తుందని చెప్పడం జరిగింది.

కొత్త రేషన్ కార్డులో మా కూతురు పేరు నమోదు కాలేదు అని చెప్పగానే వెంటనే తాసిల్దార్ తో మాట్లాడి  కూతురు పేరు వచ్చే విధంగా చూడాలని రెవెన్యూ ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు.ప్రజలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య ఉందని కలెక్టర్ కు చెప్పగానే వెంటనే పంచాయతీరాజ్ ఏఈ ను అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఎస్టిమేషన్ వేసి పూర్తి చేయవలసిందిగా ఆదేశించడమైనది.అదేవిధంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలో చెత్త బండి తిరగడం లేదా మీరు చెత్త ఇలా వేస్తున్నారు అని స్థానికులను అడగగ వారు చెత్త బండి వస్తుందని తెలపడం జరిగింది.

ఈ సందర్భంగా కలెక్టర్ అందరు  తప్పకుండా మున్సిపాలిటీ చెత్త బండిలోనే చెత్త వెయ్యాలని ,తడి , పొడి చెత్త వేరు చేసి వేయాలని గ్రామ ప్రజలకు సూచించారు.గ్రామ ప్రజలకు మిషన్ భగీరథ నీళ్లు వేడి చేసి చల్లార్చి తాగాలని సూచించారు. కలెక్టర్ ఇంటింటికి తిరిగే క్రమంలో ఇంటికి వచ్చాను లోపలికి రావచ్చా అని ఆప్యాయంగా అడుగుతూ వెంటనే రండి సార్ అని ప్రజలు ఇంట్లోకి రమ్మని చెప్పడం జరిగింది.

కలెక్టర్  వారి యొక్క కుటుంబ వివరాలు అడిగి తెలుసుకొని మీకు ఎంతమంది కుమారులు వారు ఏం చేస్తారు ఎక్కడ ఉంటారు అని వారి వివరములు అడిగి తెలుసుకున్నారు. అప్పుడు ఆమె నా పెద్ద కొడుకు హైదరాబాదులో కారు నడిపిస్తాడు చిన్న కొడుకు ఊర్లో ఆటో నడిపిస్తాడు,పెద్ద కొడుకు పెళ్లి అయ్యింది, ఐదుగురం ఉన్నాము 30 కేజీల రేషన్ బియ్యం వస్తున్నాయని  తెలిపారు. వారికి కరెంట్ బిల్లు మాఫీ రేషన్ బియ్యం వస్తున్నాయి గ్యాస్ సబ్సిడీ వస్తుందని తెలిపారు.

గ్రామంలో వలిమా బేగం అనే  మహిళకు బోదకాలున్నది పెన్షన్ రావడంలేదని కలెక్టర్ కు చెప్పగానే కలెక్టర్  జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారితో  మాట్లాడి  పెన్షన్ వచ్చే విధంగా చూడాలని తెలిపారు. వలీమా బేగంతో మాట్లాడుతూ కలెక్టర్  మీకు వ్యవసాయం ఉన్నదా ఉపాధి హామీ కూలికి వెళ్తున్నారా, ఇందిరమ్మ ఆత్మ భరోసా డబ్బులు వస్తున్నాయ అడిగి తెలుసుకున్నారు.

ప్రతిరోజు ఉపాధి హామీ పనికి వెళితే మీకు ఎన్ని డబ్బులు వస్తాయని అడగడం జరిగినది ఫీల్డ్ అసిస్టెంట్  కొలతలు సరిగా లెక్కిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ డబ్బులు వారానికి ఒకసారి ఇస్తున్నారా లేదా అని ఫీల్డ్ అసిస్టెంట్ ,ప్రజలను అడిగి తెలుసుకున్నారు.