calender_icon.png 22 April, 2025 | 11:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

22-04-2025 12:00:00 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, 21(విజయక్రాంతి) : నగరంలోని దోమల గూడ గగన్‌మహల్ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఆస్పత్రిలో గర్భిణీలతో మాట్లాడి ఆస్పత్రిలో అందు తున్న వైద్య సేవల గురించి తెలుసుకున్నారు.

గర్భిణీలకు సరిపడా తాగు నీరు అందుబాటులో ఉంచాలని ఆస్పత్రి వైద్యాధికారులకు సూచించారు. ఆస్పత్రికి కావలసిన పరికరా ల ప్రతిపా ధనలను పంపాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.జయమాలిని, మెడికల్ ఆఫీసర్ డా.రాజ్యల క్ష్మి, ఎమ్మార్వో సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.