05-03-2025 12:35:30 AM
రంగారెడ్డి, మార్చి 4 (విజయక్రాంతి): షాద్ నగర్ నియోజకవర్గం లో ఫారుక్ నగర్ మండలం కమ్మదనం లోని సోషల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల మంగళవారం జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.పాఠశాలలో ని కిచెన్ కం డైనింగ్ హాల్, స్టోర్ రూం డార్మెటరీలను సందర్శించి బియ్యం, కూరగాయలు, పప్పు దినుసులు, వంట నూనె, ఇతర సరుకుల నాణ్యతగా ఉన్నాయా లేవా... అని పరిశీలించారు.
సరుకుల స్టాక్ రిజిష్టర్ తనిఖీ చేశారు. చుట్టూరా ఉన్న ప్రహరీ గోడను పరిశీలించి, గోడ కు మరమ్మతు పనులు చేయించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వంట గదిలో లో ఉన్న స్టీమ్ యూనిట్ ను పరిశీలించి, మెషీన్ స్టీమ్ యూనిట్ ను త్వరలో మనుగడులోకి తీసుకురావాలని అందుకు కావాల్సిన బడ్జెట్ కేటాయించి బాగుచేయించాలని అధికారులకు తెలిపారు.680 పైచిలుకు మంది విద్యార్థినులు కొనసాగుతున్నందున అన్నం, ఇతర ఆహార పదార్థాలు శుచి, శుభ్రతతో చక్కగా వండడానికి ఇది ఉపకరిస్తుందని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ, స్కూల్ ప్రిన్సిపాల్ విద్యులత, ఫరూక్ నగర్ తాసిల్దార్ తదితరులు ఉన్నారు.