calender_icon.png 16 April, 2025 | 7:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్యాతన్ పల్లి లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

15-04-2025 11:13:55 PM

రామకృష్ణాపూర్ (విజయక్రాంతి): క్యాతన్ పల్లి పుర కార్యాలయంలో మంగళవారం కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల ప్రక్రియ, రిజిస్టర్లను పరిశీలించారు. మున్సిపాలిటీలో చేపట్టిన అభివృద్ధి పనులను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అన్నారు. అనంతరం ఆయన పుర కమిషనర్ తో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా అర్హులైన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే విదంగా లబ్దిదారులను పారదర్శకంగా ఎంపిక చేయాలని సూచించారు. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో మిషన్ భగీరథ నల్లా కనెక్షన్ ద్వారా ప్రతి వార్డు, ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగునీటి నిరంతరాయంగా అందించాలని అన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బంధీగా చేపట్టాలని తడి, పొడి చెత్తలను వేర్వేరుగా సేకరించి డంపింగ్ యార్డుకు తరలించాలని తెలిపారు.