15-02-2025 07:44:30 PM
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): 38వ జాతీయ క్రీడా పోటీలలో భాగంగా ఫిబ్రవరి 9న ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్ లో జరిగిన 4x100 రిలే అథ్లెటిక్ విభాగం(4x100 Relay Athletics Section)లో జిల్లాకు చెందిన మాలోతు సింధు కాంస్య పతకం సాధించిన సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్(Collector Jitesh V. Patil) శనివారం ఐడీఓసీ కార్యాలయం(IDOC Office)లో ఆమెను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... గ్రామీణ ప్రాంతాల నుంచి క్రీడాకారుల్లో ఇమిడి ఉన్న క్రీడా ప్రతిభను గుర్తించి వెలికితీయాలన్నారు.
జాతీయస్థాయిలో జిల్లా క్రీడలకు గుర్తింపు తెచ్చినందుకు అభినందనలు తెలియ చేస్తూ రూ .25 వేల చెక్కు అందజేశారు. జాతీయ స్థాయి క్రీడల్లో రాణించడానికి ప్రోత్సహించిన మాలోత్ సింధు కోచ్ నరేష్, తండ్రి మాలోతు లక్ష్మణ్ కి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడాధికారి ఎం పరంధామ రెడ్డి, అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ మహీధర్, జాయింట్ సెక్రటరీ మల్లికార్జున్, డిస్టిక్ ఒలంపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ యుగంధర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.