హనుమకొండ, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): వరంగల్ కలెక్టర్ సత్యశారదా ఆది వారం దుగ్గొండి మండలంలోని ప్రభుత్వ వ సతి గృహాలను తనిఖీ చేశారు. బీసీ బాయ్స్ హాస్టల్, మహాత్మా జ్యోతిబాపూలే హాస్టల్, గి ర్నిబావి కస్తూర్భా గాంధీ బాలిక విద్యాలయాలను తనిఖీ చేశారు. కంప్లుంట్ బాక్స్‌ల్లోని ఫి ర్యాదులను పరిశీలించి వార్డెన్లు, ప్రిన్సిపాళ్ల కు సూచనలు చేశారు. విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలు పరీక్షించారు. హాజరు, మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నారా లేదా తెలుసుకున్నారు. హాస్టల్ లోపల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యా ప్రమాణాలు, మౌళిక సదుపాయాల గురించి విద్యార్థులతో మాట్లాడారు. ప్రతి సోమవారం విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేయించాలని సంబంధిత హాస్టల్ వార్డెన్లను కలెక్టర్ ఆదేశించారు.