అమ్మ ఆదర్శ కమిటీ నిధులను సక్రమంగా వినియోగించుకోండి
విద్యార్థులతో జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): ప్రభుత్వం విద్యార్థుల కోసం అన్ని రకాల సౌకర్యాలను మెరుగుపరుస్తుందని కేవలం విద్యార్థులు ప్రతి నిత్యం పాఠశాలకు వస్తూ 10 జీపీఏ సాధించేలా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని వాటిని సాధించాలని జిల్లా C విద్యార్థులకు సూచించారు. శుక్రవారం నాగర్ కర్నూల్ మండలంలోని శ్రీపురం, తుడుకుర్తి గ్రామాల్లో పర్యటించారు. ముందుగా శ్రీపురం గ్రామంలోని ఆరోగ్య కేంద్రాన్ని గ్రామంలోని పరిసరాలను పరిశీలించారు. నిల్వ నీటిలో ఆయిల్ బాల్స్ వేసి దోమలు విజృంభించకుండా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చొరవ తీసుకోవాలని తద్వారా దోమల వ్యాప్తి నివారణ జరుగుతుందన్నారు.
వైద్య శాఖ సిబ్బంది గ్రామస్తులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని సూచించారు. అనంతరం తుడుకుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను తనిఖీ చేశారు. అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా పాఠశాలలోని మౌలిక వసతులను మెరుగుపరచుకోవాలని కలెక్టర్ సూచించారు. అనంతరం పదవ తరగతి గదిలోని విద్యార్థులతో మాట్లాడుతూ అన్ని రకాల వసతులను కల్పిస్తుందని కేవలం విద్యార్థులు 10 జిపిఏ సాధించడమే తమ పనిగా పెట్టుకోవాలని కాసేపు టీచరుగా బోధించారు. వారి వెంట వైద్య ఆరోగ్యశాఖ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ శ్రీనివాసులు తదితర వైద్య సిబ్బంది ఉన్నారు.