calender_icon.png 23 September, 2024 | 2:51 AM

పేద రోగులకు మెరుగైన వైద్యమందించాలి

25-07-2024 04:47:58 PM

ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

నాగర్ కర్నూల్, విజయక్రాంతి: ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద రోగులను వైద్యులు ప్రేమపూర్వకంగా పలకరించి వారికి మెరుగైన వైద్యం అందించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ అన్నారు. గురువారం నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణ కేంద్రంలోని (50) పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్పిటల్లోని అన్ని విభాగాలను తనిఖీ చేశారు. వివిధ రోగాలతో చికిత్స పొందుతున్న పలువురు రోగులను కలెక్టర్ పలకరించారు. ఎప్పుడు ఎలాంటి సమస్యలతో రోగులు వస్తారో తెలియని పరిస్థితి కాబట్టి వైద్యులు ఎల్లవేళలా రోగులకు అందుబాటులో ఉండాలన్నారు.  ఈ సీజన్లో డెంగీ, మలేరియా వంటి జ్వరాలు ప్రబలే ప్రమాదం ఉన్నందున అంటువ్యాధులు ప్రబలే గ్రామాల్లో అత్యవసర వైద్యసేవలు అందించాలన్నారు. గర్భిణీలకు నార్మల్ డెలివరీలకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆస్పత్రి పరిసరాలను అత్యంత పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆసుపత్రి సూపరిండెంట్ శివరాం, డాక్టర్ అన్నపూర్ణ, డాక్టర్ స్వర్ణలత, డాక్టర్ రోహిత్ తదితరులు ఉన్నారు.