calender_icon.png 28 November, 2024 | 4:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకులానికి వచ్చే బియ్యం నాణ్యత లోపిస్తే తిప్పి పంపండి

28-11-2024 01:34:01 PM

విద్యార్థుల మెనూ తప్పనిసరి పాటించాలి: జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ 

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): గురుకుల పాఠశాలలకు పౌరసరఫరాల శాఖ సరఫరా చేసే బియ్యం నాణ్యత లోపిస్తే తిరిగి తిప్పి పంపాలని నాణ్యమైన బియ్యంతో మాత్రమే విద్యార్థులకు భోజనం అందించాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ అన్నారు.  గురువారం జిల్లాలోని తెలకపల్లి బిసి గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సందర్భంగా తరగతి గదులు, వంటగది, డైనింగ్ హాల్, స్టోర్ రూమ్ లను, వంట వండే పరిసరాలను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులకు ఇబ్బందుల్లేకుండా మౌలిక వసతులు కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. మోను ప్రకారం భోజనం అందించాలన్నారు. గురుకులానికి వచ్చే బియ్యాన్ని ముందుగానే పరిశీలించి బియ్యంలో పురుగులు, రాళ్లతో పాటు నూక ఎక్కువగా ఉన్న బియ్యం తిప్పి పంపాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై అశ్రద్ధ సహించేది లేదన్నారు.రానున్న పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెంపునకు ఉపాధ్యాయులు ప్రత్యెక కృషి చేయాలన్నారు. వారి వెంట తెలకపల్లి తహసిల్దార్ జాకీర్ అలీ, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ఆంజనేయులు తదితరులు ఉన్నారు.