calender_icon.png 21 September, 2024 | 12:03 PM

ఎల్లారెడ్డి సాంఘిక సంక్షేమ హాస్టల్లో విద్యార్థులతో కలిసి నిద్రించిన కలెక్టర్

21-09-2024 10:02:57 AM

విద్యార్థులతో కలిసి ఉదయం అల్పాహారం చేసిన కలెక్టర్

విద్యార్థులకు నాణ్యమైన పౌష్టిక ఆహారం అందించాలని కలెక్టర్ ఆదేశం

కామారెడ్డి, (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలోని లింగంపేటలో నాగన్న భావినీ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు తో కలిసి శుక్రవారం రాత్రి ప్రారంభించిన అనంతరం ఎల్లారెడ్డిలో బీసీ సంక్షేమ వసతి గృహాన్ని తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనాలు అందిస్తున్నారా? అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం రాత్రి విద్యార్థులతో కలిసి భోజనాలు చేసినా అనంతరం డార్మెంటరీ రూమ్ లో విద్యార్థులతో కలిసి కలెక్టర్ ఆశిష్ సంగువాన్ నిద్రించారు. ఉదయం విద్యార్థులు తో కలిసి పారిశుధ్య పనులను అడిగి తెలుసుకున్నారు.

ప్రతి విద్యార్థి రెండు మొక్కలు నాటి దత్తత తీసుకొని వాటిని కాపాడాలని సూచించారు. మైనార్టీ గురుకుల పాఠశాలలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మైనార్టీ గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులకు నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య పౌష్టిక ఆహారం అందించాలని సిబ్బందిని హెచ్చరించారు. మొక్కలతో మానవ మనుగడకు  ఆధారం అని ముక్కలను ప్రతి ఒక్కరు పెంచాలని సూచించారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పెంపకం పట్ల శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు అనంతరం ఎల్లారెడ్డి లోని పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఆయన వెంట ఆర్డిఓ ప్రభాకర్ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్ మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు తాసిల్దార్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.