calender_icon.png 8 November, 2024 | 12:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

15-08-2024 10:35:35 AM

కామారెడ్డి: జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంపై జాతీయ జెండాను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆవిష్కరించారు. అనంతరం జెడ్పి కార్యాలయం ఆయన జాతీయ జెండాను ఎగరవేశారు. ముందుగా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్రం వచ్చిందని చెప్పారు. దేశం కోసం పోరాటం చేసిన మహనీయుల సేవలను కొనియాడారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో చందర్, సిపిఓ రాజారాం, ఏవో మసూర్ అహ్మద్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, జిల్లా భూగర్భ జలాల అభివృద్ధి అధికారి సతీష్ యాదవ్, వ్యవసాయ అధికారిని భాగ్యలక్ష్మి, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.