కామారెడ్డి కలెక్టరేట్‌లో మాట్లాడుతున్న కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి,(విజయక్రాంతి): రైతుభరోసా(Rythu Bharosa), ఇందిరమ్మ ఆత్మీయ భరోసా(Indiramma Atmiya Bharosa), ఇందిరమ్మ ఇండ్ల పథకాల(Indiramma Housing Scheme)ను సమర్థవంతంగా అమలు చేసేందుకు జాబితా తయారీ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్(Collector Ashish Sangwan) అన్నారు. శనివారం అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ... రైతు భరోసా కార్యక్రమం కింద ఈ నెల 15 నాటికి సన్నాహక ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. గుట్టలు, రొడ్లు, నాలా కన్వర్షన్, భూ సేకరణ, లే అవుట్, వ్యవసాయానికి యోగ్యంగా లేని భూములను పరిశీలించాలని తెలిపారు. ఈ నెల 16 నుండి 20 వరకు క్షేత్ర పర్యటన చేసి డేటా సిద్దం చేయాలని తెలిపారు. గ్రామ సభలో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని కొరారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఒక కుటుంబానికి ఒక యూనిట్‌గా తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
భూమిలేని వ్యవసాయ కూలీలు కనీసం 20 రోజుల పాటు ఉపాధి హమీపథకం కింద పనిచేసిన డేటాను సిద్దం చేయాలని తెలిపారు. ఆదార్ నెంబర్ మ్యాపింగ్ చేయడం జరుగుతుందన్నారు. గ్రామ సభలో చర్చించి తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రజాపాలన కార్యక్రమంలో ధరఖాస్తు చేసుకున్న వారు గతంలో రేషన్ కార్డుల కొరకు ధరఖాస్తు చేసుకున్న వారి డేటాను సిద్దంచేయాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టాలని కొరారు. తుది నిర్ణయం గ్రామ, వార్డు సభలో చర్చించడం జరుగుతుందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల సర్వే రేపటిలోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అదే విధంగా ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు 5 శాతం సూపర్‌చెక్ చేయాలని తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి 3 వేల 500 ఇండ్లు కేటాయించడం జరుగుతుందన్నారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు విక్టర్, శ్రీనివాస్‌రెడ్డి, సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఆర్డీవోలు రంగనాథ్‌రావు, ప్రభాకర్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.