కామారెడ్డి,(విజయక్రాంతి): ప్రజావాణిలో వచ్చిన ఆర్జీలను పరిశీలించి సత్వరమే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశాలులో జిల్లాలోని వివిధ సమస్యలపై దరఖాస్తుదారుల అర్జీలను స్వీక రించారు. అనంతరం ఆయా దరఖాస్తులను పరిశీలించి తగు చర్యల నిమిత్తం సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజావాణి అనంతరం ఇందిరమ్మ కమిటీలు ఎల్ ఆర్ఎస్ దరఖాస్తులు ప్రజావాణి పెండింగ్ ధాన్యం సేకరణ అంశాలపై అధికారుల తో కలెక్టర్ సమీక్షించి పలు సూచనలు చేశారు. ఇందిరమ్మ కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని తెలిపారు. గ్రామస్థాయిలో మున్సిపల్ వాడు స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు.
కమిటీల వివరాలను తెలుపుతూ సంతకం చేసిన జాబితాలు సమర్పించాలని అన్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల మేరకు సర్వే టీంలు ప్రభుత్వ నిబంధనల మేరకు సర్వే చేయాలని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులు పరిశీలన చేయాలని కోరారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సత్వర చర్యలు చేపట్టాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గత వారం వరకు 182 ఆర్జీలు రాగా వాటిల్లో వాటిని పరిశీలించి సంబంధిత అధికారులు 17450 అర్జీలను పరిశీలించి చర్యలు తీసుకోవడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. మిగిలిన 727 ఆర్జీలలో 533 పెండింగ్లో ఉన్నాయని 194 దరఖాస్తులు ఇతర శాఖలకు చెందినవి కాక వాటిని ఆయా శాఖలకు బదిలీ చేశామని తెలిపారు్. దసరా పండుగ జరిగేడంతో నలభై తొమ్మిది ఆర్జీలు రావడం జరిగింది తెలిపారు. పెండింగ్లో ఉన్న ఆర్జీలను పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.