జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్
కామారెడ్డి, (విజయక్రాంతి): ఎన్నికలలో వినియోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు ట్యాంపరింగ్ చేయబడవని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఆశిష్ సంగువాన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత ఎన్నికలలో పేపరు బ్యాలెట్ విధానాన్ని మళ్లీ ప్రవేశపెట్టాలని కోరుతూ దాఖలైన ప్రజా హిత వ్యాజ్యాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టి వేసిందని అన్నారు. ఈవీఎం ట్యాంపరింగ్ పై వేసిన పిటిషనర్ చేసిన వాదనలను తిరస్కరించిందని కలెక్టర్ తెలిపారు.