calender_icon.png 29 November, 2024 | 3:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామీణా క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీయాలి

29-11-2024 12:35:12 AM

కామారెడ్డి,(విజయక్రాంతి): గ్రామీణ క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకే చీప్ మినిస్టర్ 2024 లో నిర్వహించేందుకై ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసిందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో సీఎం కప్పు నిర్వాహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయికి చేర్చేందుకు 2028లో జరుగనున్న ఒలంపిక్స్ క్రీడల్లో మరిన్ని పథకాలు సాధించేందుకు వారిని గుర్తించి ప్రోత్సహించడానికి పోటీలను సాధించేందుకు వారిని గుర్తించి ప్రోత్సహించడానికి పోటీలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లాస్థాయి కమిటీ నేతృత్వంలో చైర్మన్గా కలెక్టర్, వైస్ చైర్మన్గా ఎస్పీ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జిల్లా పరిషత్ సీఈవోతో పాటు డిఈవో, డిపిఓ జిల్లా పరిశ్రమలు, జీఎం జిల్లా యువజన క్రీడల సంక్షేమ అధికారి, ఒలంపిక్స్ సంఘం పాఠశాల క్రీడల ఫెడరేషన్ ఇతర క్రీడా సంఘం  అధ్యక్షులు కార్యదర్శి సమావేశానికి హాజరయ్యారు.

గ్రామపంచాయతీ స్థాయి పోటీలు డిసెంబర్ 7 నుంచి 8 వరకు , డిసెంబర్ 10 నుంచి 12 వరకు మండలస్థాయి క్రీడలు, మున్సిపల్స్థాయి క్రీడలు డిసెంబర్ 16 నుంచి 21 వరకు జిల్లా స్థాయి క్రీడలను  నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. రాష్ట్రస్థాయికి కామారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్య మంచి ఉత్తమ జట్టును ఎంపిక చేయాలని కొరారు. రాష్ట్రస్థాయి ఎంపికలు డిసెంబర్ 27 నుంచి జనవరి 225 వరకు జరుగుతాయని తెలిపారు. జిల్లాలో సబ్ జూనియర్, సీనియర్స్ విభాగాలల్లో బాలురు, బాలికల క్రీడలు నిర్వహించుటకు సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సింధుశర్మ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, జిల్లా యువజన క్రీడల అధికారి జగన్నాథ్, వివిధ శాఖల అధికారులు, వివిధ ఫెడరేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.