15-02-2025 09:07:23 PM
ఈ నెల 16 నుండి 28 వరకు వివరాల నమోదు
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే(Samagra Intiti Kutumba Sarvey)లో ఇటీవల పాల్గొనని కుటుంబాల వివరాలు ఈ నెల 16 నుండి 28 వరకు నమోదు చేసుకోవచ్చునని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్(Collector Ashish Sangwan) ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల నిర్వహించిన సర్వేలో నమోదు చేసుకొనని కుటుంబాల వివరాలు ఎంట్రీ చేసుకునే విధంగా ప్రభుత్వం మరొక అవకాశం కల్పించిందని తెలిపారు.
సర్వే కు సంబంధించిన కుటుంబ వివరాలు నమోదు చేసుకునేందుకు మండల అభివృద్ధి అధికారి కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాల్లోని ప్రజా పాలన సేవా కేంద్రాల్లో నిర్ణీత పొఫార్మాలో పూర్తి వివరాలు నమోదు చేసుకోవచ్చును. లేదా ప్రభుత్వం ఇట్టి విషయంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 040- 21111111 నకు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు వివరాలు తెలియజేయవచ్చని లేదా ప్రభుత్వ వెబ్ సైట్ http:// seeepcsurvey.cgg.gov.in నుండి దరఖాస్తును డౌన్ లోడ్ చేసుకొని పూర్తి వివరాలు నమోదు చేసి ప్రజాపాలన సేవా కేంద్రంలో అందించవచ్చని ఆ ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.